దుష్ట ద్వయం కుట్రతోటే మునుగోడుకు ఉప ఎన్నికలు

0
20

-ఆ కుట్రలకుతెరలేపింది మోదీ,అమిత్ షా లే
-ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు రాకుండా అడ్డుకోవడంలో భాగమే
-25 వేల కాంట్రాక్టులకు మునుగోడును అమ్మిన కోమటిరెడ్డి
-ఇక్కడి ప్రజల ఆశీర్వాదమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు బలం
-బిజెపి పై పోరుకు 70 వేల మంది గులాబీ సైన్యం
-మునుగోడు లో కాషాయం కుట్రలు నడవనియ్యం
-యావత్భారతదేశంలోనూ ఆసరా ఫించన్లు అందించాలి
-ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అదే
-కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం అందులో భాగమే
– మంత్రి జగదీష్ రెడ్డి
– మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణ పురం మండల కేంద్రంలో టి ఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనం

హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, మాజీ శాసనసభ్యుడు, నియోజకవర్గ టి ఆర్ యస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు.
బోనమెత్తిన విప్ సునీత ,నారాయణ పురం యం పి పి గుత్తా ఉమా, జడ్ పి టి సి తదితరులు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తుంగతుర్తి శాసనసభ్యుడు గాధరి కిశోర్ కుమార్ కర్ర సాము.

మోడీ,అమిత్ షా ల దుష్ట ద్వయం తోటే మునుగోడు కు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు వచ్చి దేశరాజకీయాలను శాసిస్తరన్న భయం తోటే వారు ఇటువంటి కుట్రలకు తెర లేపారని ఆయన ఆరోపించారు. మునుగోడు ప్రజల విశ్వసనీయతను ఆ దుష్ట ద్వయం చెంతన చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 25 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆయన ధ్వజమెత్తారు.మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణ పురం మండల కేంద్రంలో జరిగిన టి ఆర్ యస్ పార్టీ శ్రేణుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు లతో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, మాజీ శాసనసభ్యుడు నియోజకవర్గ టి ఆర్ యస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆశీర్వాదమే ముఖ్యమంత్రి కేసీఆర్ బలమన్నారు.సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణా పెట్టింది పేరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆత్మీయ సమ్మేళనాలు,వన భోజనాలు ఆ సంస్కృతి లో బాగామే నని ఆయన స్పష్టం చేశారు. బిజెపి పై పోరుకు మునుగోడు లో 70 వేల మంది గులాబీ దండు సన్నద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ కాషాయం కుట్రలకు తావు లేదని ఆయన తేల్చిచెప్పారు. యావత్ భారతదేశంలోనూ తెలంగాణా లో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అమలు పరచాలన్న ప్రజల డిమాండ్ నుండి దృష్టి మరల్చేందుకే బిజెపి ఉప ఎన్నికల ప్రహాసాన్నీ సృష్టించిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కుడా అదేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం అందులో భాగమేనని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

కాగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ కర్రసాము ప్రదర్శన గులాబీ దండులో ఉత్తేజాన్ని నింపింది.ఈ మొత్తం ఎపిసోడ్ లో కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అదే విదంగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ లను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తో పాటు స్థానిక ఎం పి పి గుత్తా ఉమా,జడ్ పి టి సి తదితరులు ఎత్తుకుని వచ్చిన ఉరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆటపాటలతో ఆత్మీయ సమ్మేళనం ఊర్రూత లూగిస్తే సామూహిక భోజనాలతో సమ్మేళనంతో పండుగ సందడి వాతావరణం ఏర్పడింది.