రాజధానికి నిధులడగటం కోర్టు ధిక్కారమే

– మూడు రాజధానుల కోసం సమయం వృధా
– బీజేపీ నేత లంకాదినకర్
మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి నిధులు అడగడం కోర్టు ధిక్కారం అవుతుంది.దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో చేతనైతే గతి శక్తి యోజనలో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పెట్టాలనిబీజేపీ నేత లంకా దినకర్ సూచించారు.
ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల కోసం సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతుంటే తట్టుకోలేక సీఎం జగన్ మూడు రాజధానుల నిధుల అంశం వెలుగులోకి తెస్తున్నారని లంకా దినకర్ విమర్శించారు. గతి శక్తి యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎలా సమకూర్చుకుంటారో చెప్పి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం పొందాలని, ఇప్పటికే ఆలస్యం అయ్యిందనిఅన్నారు.