హైదరాబాద్ లో అల్లర్లకు సీఎం మరో కుట్ర

-లిక్కర్ స్కాంపై చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ తెగబడుతున్నడు
-తన బిడ్డను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధపడుతున్నడు
-సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్
-కేసీఆర్ కుటుంబం చీకటి దందాలన్నీ పాదయాత్రతో బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నరు
-అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న కేసీఆర్ కుటుంబం
-రాళ్లు, రాడ్లతో అడ్డంకులు స్రుష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు
-27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలి రండి
-కరీంనగర్ ’నిరసన దీక్ష’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ లో మత ఘర్షణలు లేవనెత్తడానికి కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తన బిడ్డ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో… ఆ చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశాడని అన్నారు. తన బిడ్డను కాపాడుకునేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేయించి అడ్డుకున్నారని పేర్కొన్నారు.

ఎన్ని దాడులు చేసినా… రాళ్లు, రాడ్లు విసిరినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను బొంద పెట్టే వరకు పాదయాత్ర కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటాంరు. అందులో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27న జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్భంధాలపై ఈరోజు కరీంనగర్ లోని తన నివాసంలో బండి సంజయ్ ‘‘ నిరసన దీక్ష’’ చేపట్టారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ దీక్షలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, జిల్లా అధ్యక్షులు గంగిడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా అడ్డుకున్నరో ప్రజలు చూశారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. ఇది మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర. ఏదో ఒక సాకుతో యాత్రను ఆపాలని కుట్ర చేశారు. కొన్ని చోట్ల మాపై దాడులు చేశారు.. అయినా భరించినం. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.

ప్రజలను కలవాల్సిన సీఎం, పేదల బాధలు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌజ్, ప్రగతి భవన్ లో సేద దీరుతున్నరు. బాధ్యతాయుతమైన పార్టీగా బీజపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామే తప్ప ఎవరినో రెచ్చగొట్టడానికో కాదు. సీఎం కుటుంబంపై లిక్కర్ స్కాం ఆరోపణలొస్తున్న నేపథ్యంలో దారి మళ్లించడానికే పాదయాత్రను అడ్డుకున్నరు. ఇది ప్రజందరికీ అర్ధమైంది.

కుటుంబ రాజకీయాలు, డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఎంతటి దారుణంగా ఉంటాయో కేసీఆర్ ను చూస్తే తెలుస్తుంది. చిన్నప్పుడు బిడ్డ కింద పడితే పైకి చందమామను చూపో..పక్కోడిని కొట్టే ఏడుపు ఆపుతాం.. కేసీఆర్ కూడా అంతే.. బిడ్డ కోసం నా పాదయాత్రను అడ్డుకున్నడు. దాడులు చేయించిండు.

ఏ లంగ దందాలు చూసినా కేసీఆర్ కుటుంబానివే. ఇసుక, మైనింగ్, వైన్స్, రియల్ ఎస్టేట్ దందాలన్నీ వాళ్లవే. చివరకు పత్తాల దందా వాళ్లదే. ఇంకెన్ని బయటకొస్తాయో… 1400 మంది చనిపోయిండ్రు. ఆ శవాల చితిమంటలపై కేసీఆర్ కుటుంబం చలి కాచుకుంటోంది.

Leave a Reply