అక్రమ మైనింగ్ వల్లే శాంతిపురం క్వారీలో పేలుళ్లు!

– భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు
– గోవిందప్ప కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించాలి
– తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు

అమరావతి: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమపురం క్వారీలో బుధవారం జరిగిన పేలుడు ఘటనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ క్వారీయింగ్ నిర్వహించడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు.

సోమవరం క్వారీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమమైనింగ్ చేస్తున్న వైసీపీ నేతల ధన దాహానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. సోమవరం పేలుళ్లలో మృతిచెందిన గోవిందప్పకు చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తంచేస్తూ…బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యసహాయంతోపాటు పరిహారం అందించాలని విజ్జప్తి చేశారు.

Leave a Reply