రాష్ట్రంలో వెయ్యి డాక్టర్ పోస్టుల భర్తీ

-మెదక్ ను మెడికల్ హబ్ గా మారుస్తాం
-ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
-మూతపడే స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రులు
-చరిత్ర సృష్టించిన వరి సాగు
-దక్షిణ భారత దేశ బాండాగారంగ రాష్ట్రం మారింది
-ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దసరా వరకు వెయ్యి మంది డాక్టర్లను నియామకం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మెదక్ జిల్లాను మెడికల్ హబ్ గా త్వరలోనే మారుస్తున్నాం. జిల్లాలో డెలివరీల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు మూతపడే పరిస్థితి ఉంది. జిల్లాకు మెడికల్ కళాశాల, 40 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. మందు లేదు, డాక్టర్ లేదు, నర్స్ లేదు అనే అంశం ఎక్కడా రావొద్దు. జిల్లాలో 150 సబ్ సెంటర్లు ఉన్నాయి.

ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. దసరా వరకు పూర్తి చేస్తాం. ప్రతి పీహెచ్ సిలో మూడు నెలల మందులు స్టాక్ ఉండాలి. 23 కోట్ల తో క్రిటికల్ కేర్ యూనిట్. బీసీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల మంజూరు చేశాం. డబుల్ బెడ్రూం లో బస్తి దవాఖాన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఎలక్ట్రిసిటీ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేట్ కు అమ్ముకుంటున్నారు. భవిష్యత్ లో ప్రభుత్వానికి, ప్రజలకు ఇబ్బందులు తప్పవు.అసెంబ్లీ, జెడ్పి సమావేశాల్లో కరెంట్, మంచి నీళ్ళపై చర్చనే లేకుండా పోయిందంటే రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎంత మార్పు వచ్చిందనేది గమనించాలి. అదే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని చెప్పవచ్చు.గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్ ల బాధలు మాటల్లో చెప్పలేనిది. అప్పట్లో మోటార్ల మరమత్తులు, పైపులు కొనుగోలుకు మాత్రమే సర్పంచులు సరిపోయే వాళ్ళు. 70 ఏళ్లలో జరుగని అభివృద్ధి కేవలం ఏడేళ్ల టీఆరెఎస్ పాలనలో సాధ్యమైంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది.

రైల్వేకు లాస్ వస్తే పదేళ్ల వరకు భరిస్తం అని రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది. రైల్వే ఏర్పాటుకు మూడో వంతు నిధులు, భూ సేకరణ పనులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేయడం వల్ల మెదక్ కు రైలు వస్తుంది.మన ఊరు మన బడి పనుల్లో ఎందుకు ఆలస్యం అవుతుంది. జిల్లాలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. విద్య, వైద్యం అత్యంత ప్రాముఖ్యత గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సోమవారం సమీక్ష పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ కు సూచించారు.బడులు బాగుంచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. డీఈఓ అన్ని స్కూల్స్ విజిట్ చేయాలి, వేగంగా పనులు చేయాలి.

ఈ సమావేశంలో పలువురు జడ్పీటీసీలు ఎంపీపీలు సమస్యలపై విన్నవించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, పద్మా రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply