మోసానికి ప్రతి రూపం జగన్ రెడ్డేనని రాజధాని అమరావతి అంశంతో రుజువైంది

– జగన్.. మూడు రాజధానుల ముచ్చట పక్కన పెట్టాలి
– మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

మోసానికి ప్రతి రూపం జగన్ రెడ్డేనని రాజధాని అమరావతి అంశంతో రుజువైందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాడు రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులు నేడు హక్కుల కోసం రోడ్డెక్కాల్సివచ్చింది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానుల అంశానికి తెరలేపారు.

అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నానని అసెంబ్లీలో మూడు సార్లు ‘ఎస్’ అని చెప్పి, మాటమార్చారు. మూడు రాజధానులు కడతామని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదో తెలపాలి. అమరావతి రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం బాధాకరం. ఒక రాజధానినే అభివృద్ధి చేయలేని వ్యక్తి మూడు రాజధానులు నిర్మించగలడా? చంద్రబాబు కట్టిన అసెంబ్లీ, సెక్రటేరియేట్ లలో పరిపాలన సాగిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఐదు కోట్ల ప్రజలు మద్దతు ఇస్తున్నా జగన్ మనసు మారకపోవడం బాధాకరం.

వ్యక్తిగత స్వార్థ రాజకీయం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విశాఖలోని వేల ఎకరాల భూముల విలువ పెంచుకోవడం కోసం రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. ఆసక్తితో చేస్తే అమరావతి హైదరాబాద్ ను తలదన్నే రాజధాని కాగలదు. అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వారి ఎమ్మెల్యేలను జగన్ ప్రోత్సహిస్తున్నాడు. రాజధాని రైతులకు అవాంతరాలు తలపెడితే అది వైసీపీకి సమాధి అవుతుందని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. గతంలో అమరావతి రైతుల తిరుపతి పాదయాత్రలో రోడ్డుపై భోంచేయాల్సివచ్చింది. ప్రజలు ఛీకొడుతున్నా జగన్ లో మార్పు రావడంలేదు.

రైతుల ఉద్యమానికి ప్రధాని మోడీనే మారారు. జగన్ ఎంత? అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. జగన్ అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. సైకో ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలుస్తాడు. జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. ఇకనైనా రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. జగన్ మూడు రాజధానుల ముచ్చట పక్కన పెట్టాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలిగానీ రాజధాని మాత్రం ఒకటే ఉండాలి. జగన్ లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ మారకపోతే వైసీపీని ప్రజలే బంగాళాఖాతంలో కలుపుతారు. వైసీపీ ప్రభుత్వానికి ఘోరీ కట్టే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply