అమ‌రావ‌తి అజ‌రామ‌రం

– కోర్టు తీర్పుతోనైనా రాజ‌ధాని అభివృద్ధి చేప‌ట్టాలి
– కుట్ర‌లు చేసిన వైసీపీ దొంగలంతా జైలుకెళ్ల‌క త‌ప్ప‌దు
-వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో అవినాశ్‌రెడ్డితోపాటు జ‌గ‌న్‌రెడ్డి హ‌స్త‌మూ ఉంది
– నా త‌ల్లికి మంత్రులు క్ష‌మాప‌ణ‌లు చెబితే అప్పుడు అసెంబ్లీకి హాజ‌రు ఆలోచిస్తాం
– ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా మేము సిద్ధం
– ప్ర‌జారాజ‌ధాని ఉద్య‌మం విజ‌యం రైతుల‌దే..వారికి పాదాభివంద‌నం
మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

2014లో పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రుల్ని కట్టుబట్టలతో మెడపట్టి బయటికి గెంటేశారు. 62 సంవత్సరాలపాటు అభివృద్ధి చేసుకున్న‌ హైదరాబాద్ లేకుండా అన్యాయంగా రాష్ట్ర విభ‌జ‌న చేసింది కాంగ్రెస్.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పరిపాలించారు. హైదరాబాద్ కు ధీటుగా ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, పరిపాలన ఒకేచోట ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే ఆలోచనతో 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించారు.

శాసనసభలో సుదీర్ఘ చర్చ తరువాత ఆనాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం జగన్ కూడా ఒప్పుకున్న తరువాతనే అమరావతిలో రాజధాని రావాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రజల కోరిక మేరకు రైతులు స్వచ్ఛందంగా దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 30 వేల ఎకరాలను అమరావతి రైతులు రాజధాని కోసం భూములిచ్చారు.

యుద్ధ ప్రాతిపదికన ప్రపంచంలోనే బెస్ట్ కన్సెల్టెన్సీని తీసుకొచ్చి రాజ‌ధాని కోసం అద్భుత మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. భావి అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు నిర్మాణం చేశారు.54
lokesh
వివిధ సంస్థలను కూడా చంద్రబాబు అమరావతికి తీసుకొచ్చారు. సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అసెంబ్లీ శాశ్వ‌త భ‌వ‌నాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.

ఎన్నిక‌ల‌కి ముందు రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుందని చెప్పిన జ‌గ‌న్ ..ఇక్క‌డే ప్యాలెస్ కూడా కట్టుకున్నాన‌ని న‌మ్మ‌బ‌లికారు. ఎన్నిక‌ల‌య్యాక ముఖ్య‌మంత్రి కుర్చీ ఎక్కి మూడు ముక్క‌లాట‌కి తెర‌తీశారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో ప్ర‌జ‌ల్ని మభ్యపెట్టి మూడు రాజ‌ధానులంటూ మ‌రో కుట్ర‌కి తెర‌తీశారు. దీంతో టిడిపి తీసుకొచ్చిన పరిశ్రమలు తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. రాజ‌ధానిపై నేడు కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. 807 రోజులపాటు రైతులు ధర్నాలు, దీక్షలు శాంతియుతంగా ధర్నాలు చేశారు.

మహిళలపై వైకాపా నాయకులు అసభ్యకరంగా మాట్లాడారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.బంగారు గాజులుంటే వారు రైతులేనా అని వ్యంగంగా మాట్లాడారు. రైతుల పిల్లలు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారా అని చులకనగా మాట్లాడారు.

రైతులు జగన్ రెడ్డిని ఏనాడూ అడ్డుకోలేదు. అమ‌రావ‌తి రైతుల‌కు తాను చేసిన ద్రోహంతో జ‌గ‌నే వ‌ల‌ల భ‌ద్ర‌త పెట్టించుకున్నారు. మంగ‌ళ‌గిరి శాసనసభ్యుడికి ఇకనైనా బుద్ధి రావాలి. రాజ‌ధాని ఇక్క‌డే వుండాల‌ని జగన్ కు చెబుతా, ఒప్పిస్తానన్న వ్యక్తి ఏనాడు అమరావతి గురించి సీఎం వద్ద ప్రస్తావించలేదు. రామకృష్ణారెడ్డి ప్రజలకు మోసం చేశారు. సీఎం, ఎమ్మెల్యేకి ప్రజలు గుణపాఠం చెబుతారు.

ఇకనైనా కోర్టు తీర్పుని గౌరవించి సీఎం, బొత్స సత్యనారాయణలు యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు ప్రారంభించాలి. కోర్టు ఆదేశాల మేరకు ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా
కొత్త రాజధానులు ఏర్పాటు చేయడానికి శాసనసభకి అధికారంలేదని కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది.
విభజన చట్టంలో ఒకే రాజధాని అని స్పష్టంగా ఉంది. దీంతోపాటు సీఆర్ డీఏ చట్టం వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వానికి చట్టం మార్చే హక్కు లేదు.

నాడు చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది.టీడీపీ హయాంలో అనంతపురానికి కియా మోటార్స్‌, చిత్తూరు జిల్లాకు ఫాక్స్ కాన్, సెల్ ఫోన్, టీవీ లు తయారుచేసే పరిశ్రమలొచ్చాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో ఫిషనరీస్ ను ప్రోత్సహించాం. ఐటి మంత్రిగా ఐటీ రంగాన్ని విశాఖకు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను శంకుస్థాపన చేశాం.అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కి టిడిపి మద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. దురుద్దేశాల‌తో రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌కి జ‌గ‌న్ తెగ‌బ‌డ‌టంతో శాసనమండలిలో పోరాడాం. ఆపాం.నిస్వార్థంగా 5 కోట్ల ఆంధ్రుల కోసం ఉద్య‌మించిన అమరావతి రైతులకు పాదాభివంద‌నం.

ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును 3 రాజధానుల పేరుతో నాశ‌నం చేశాడు ఈ దొంగ అబ్బాయి.ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఆరోపించిన వైసీపీ నేత‌లు మూడేళ్ల‌లో ఏం చేశారు? నేను రాజ‌ధానిలో వందల ఎకరాల
lokesh2 కొన్నాన‌ని ఆరోపించినోళ్లు ఒక్క సెంటు భూమి ఉంద‌ని నిరూపించ‌లేక‌పోయారు.ప్ర‌జారాజ‌ధానికి నాడు భూములిచ్చారు, నేడు ఉద్య‌మంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతుల‌ త్యాగాలను మరచిపోకూడదు.

చ‌ట్టం, న్యాయం అంటే భ‌యం భక్తి లేని వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోపాటు పాటు నాయకులు జైలుకు వెళ్లడం ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దొంగ అబ్బాయి. వైసీపీకి చెందిన ఒక మాజీ ఎంపీ కోర్టు తీర్పును తప్పుబట్టే పరిస్థితికి దిగజారారు.

వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.ఈ హత్య వెనుక జగన్ రెడ్డి హస్తం లేక‌పోతే జ‌గ‌న్ భార్య భారతి రెడ్డి తండ్రి గంగిరెడ్డి కుట్లు వేసి క‌ట్లు ఎందుకు క‌ట్టారు? భార‌తి తండ్రి గంగిరెడ్డికి కుట్లు వేయమని ఎవరు చెప్పారు? తేల్చాల్సిన అవసరం ఉంది.

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అన్ని చట్టాలను ఉల్లంఘించిన ఏకైక డీజీపీ గౌతమ్ సవాంగ్.రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటారు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్.శాసనసభ సాక్షిగా నా తల్లికి అవమానం జరిగింది. ఇది ఏ ఒక్క మహిళకో జరిగిన అవమానం కాదు, రాష్ట్ర మహిళలందరికీ జరిగిన అవమానం. మంత్రులు క్షమాపణ చెప్పే వరకూ చట్టసభలకు వెళ్లరాదని పొలిట్ బ్యూరోలో మెజారిటీ సభ్యులు సూచించారు.

టీడీఎల్పీలో తుదినిర్ణయం తీసుకుంటాం. మంత్రుల చేత క్షమాపణ చెప్పే వరకు అసెంబ్లీ, శాసన మండలి కి వెళ్లకూడదని పోలిట్ బ్యూరో అభిప్రాయ‌ప‌డింది. న్యాయం రైతుల వైపు ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కు జగన్ రెడ్డికి ఉంది.

Leave a Reply