నిరుపేద‌ల‌కు ఉన్న‌త విద్య‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేశారు

విద్యా రంగంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్‌:

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రసంగం:
– వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఈ మూడేళ్ల పాలనలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు.. గతంలో ఎవరూ చేయలేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఇంగ్లిష్‌ మీడియమ్, సీబీఎస్సీ సిలబస్‌ ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలు.
– అమ్మ ఒడి నిజంగా ఒక గొప్ప పథకం. సీఎంగారు ఒక సంఘ సంస్కర్తగా నిల్చారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను మరింత చేరువ చేశారు. గతంలో బడుగు, బలహీనవర్గాలకు విద్య, ఉన్నత విద్య అందనంత దూరంలో ఉండేది.
– అయితే విద్య అనేది ఒక గొప్ప ఆయుధం. అది సమాజాన్ని మార్చగలుగుతుంది అని చాలా మంది చెప్పినా, ఆ దిశలో ఎవరూ అడుగులు వేయలేదు.
– ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయో మనం స్వయంగా చూస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలన్నీ మారిపోతున్నాయి.
– పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పే, మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఆ దిశలోనే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
– ఇంకా ఒక దళితుడిని అయిన నాకు విద్యా శాఖను అప్పగించారు. ఇది దళిత జాతికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను.
– ఒక తల్లి మనసు గుర్తించిన వ్యక్తిగా జగన్‌గారు, పథకాలు ప్రవేశపెట్టారు. అన్నీ పక్కాగా అమలు చేస్తున్నారు.
– తల్లి తన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడుతుందని తెలుసు కాబట్టే, అమ్మ ఒడి పథకం అమలు చేస్తూ, ఆమెకు ఒక అండగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఆదర్శంగా నిలుస్తోంది.
– ఆ విధంగా జగన్‌గారు అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
– గత తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేశారు.
– దానికి పూర్తి భిన్నంగా నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మారుస్తున్నాం. తొలి దశలో 15వేలకు పైగా పాఠశాలల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకు రూ.3667 కోట్లు వ్యయం చేస్తున్నాం.
– అంతే కాకుండా రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తూ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద ఇంకా ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టిన ఘనత జగన్‌గారిది.
– ఇంగ్లిష్‌ మీద పట్టు సాధించడం అంటే, అది పులి పాల వంటిదని నాడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ఆ విషయం తెలుసు కాబట్టే జగన్‌గారు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టారు.
– ఇంకా డిజిటల్‌ విద్య వైపు కూడా అడుగులు వేశారు. అందుకోసం రూ.600 కోట్లతో బైజూస్‌ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా తప్పు పడుతున్న చంద్రబాబు, అది జగన్‌ జూస్‌ అని విమర్శించారు.
– చంద్రబాబు చేసిన ప్రైవేటు యూనివర్సిటీ చట్టం ఒక్కటి చాలు, ఆయన విద్యా రంగం çపట్ల వ్యవహరించిన విధానం.
– దాన్ని కూడా మారుస్తూ, ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తూ, ఆ ఫీజు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఎంసెట్‌ పరిధిలోకి తీసుకొచ్చాం.
– విద్య మీద చేసే వ్యయం, భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని సీఎంగారు చెప్పారు. ఆ దిశలోనే అనేక పథకాలు, కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.
– అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో..
– ఆనాడు విద్యార్థుల కోసం ఆలోచించిన మహానేత వైయస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తే, దాన్ని మరో నాలుగు అడుగులు ముందుకు నడిపించారు జగన్‌గారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ, విద్యాదీవెన అమలు చేస్తున్నారు.
– ఈ మూడేళ్లలో విద్యా రంగంలో దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మనది.
– జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇస్తామన్న గత తెలుగుదేశం ప్రభుత్వం, ఆ మాట కూడా నిలబెట్టుకోకపోతే, ఈ ప్రభుత్వం దాన్ని సాకారం చేస్తోంది.
– విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి

Leave a Reply