Home » ఢిల్లీలో బహుజన పొలికేకలు

ఢిల్లీలో బహుజన పొలికేకలు

ఏపీలో ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ ,బీసీ, మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలపై ఢిల్లీలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఫిర్యాదుల పరంపర చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో వైకాపా మూడేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ, మహిళలపై జరిగిన, జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాల పై తన బృందంతో కార్యాలయాలను కలియ తిరిగారు.ఏపీ హైకోర్టు అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రైతులు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలను,మంత్రులను కలిసేందుకు మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్, నారాయణ రాణే,నరేంద్ర సింగ్ తోమర్, నిర్మలాసీతారామన్, అశ్విన్ వైష్ణవ్ ,ఉపేంద్ర యాదవ్ తదితరులు కలిశారు .న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలిఅని అమరావతి లో భూములు తీసుకున్న దాదాపు 44 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యక్రమాలను ప్రారంభించాలని మంత్రులను కోరారు.మంత్రులంతా అమరావతిలో ఆయా సంస్థలు కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఆదేశిస్తామని సుముఖత వ్యక్తం చేశారు.

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు బాలకోటయ్య రాజధాని అమరావతి తోపాటు, ణ్డఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపై దాడులు ,హత్యలు, హత్యచారాలను పలువురు పెద్దల దృష్టికి తీసుకువచ్చారు.

ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ ,ఎస్సీ, ఎస్టీ ,బిసి ,మైనారిటీ కమిషన్ లోని అధికారులను కలిశారు. ఎంపీ సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు, కనకమేడల రవీంద్రనాథ్ , హిందూ మహా సభ జివిఆర్ శాస్త్రి లకు వినతిపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ గారిని కొప్పుల రాజు ద్వారా కలిసి అమరావతి పైన రెండు వినతి పత్రాలను సమర్పించారు .

కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ,మాజీ ఎంపీ రేణుకాచౌదరి తో కలిసి ఎన్సీపి నేత శరద్ పవర్ ని కలిసి రాష్ట్రంలో జరిగిన డాక్టర్ సుధాకర్, నంద్యాల అబ్దుల్ కలాం, కర్నూలు వజీరా,గుంటూరు రమ, రాజమండ్రి శిరోముండనం వరప్రసాద్ సంఘటనను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. జరిగే రాజ్యాంగ వ్యతిరేక దాడులపై లోక్ సభ, రాజ్యసభలో ప్రస్తావించాలని ఆయన కోరారు. బాలకోటయ్య చెబుతున్న విషయాలను ఆసక్తిగా ఆలకించారు. లోక్ సభ, రాజ్య సభ లలో ప్రస్తావిస్తామని పలువురు బాలకోటయ్య కు హామీ ఇచ్చారు.

Leave a Reply