Home » International » Page 15

అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు..

అమెరికాలో తుపాకుల మోతకు తెరపడడం లేదు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా నిన్న సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న…

Read More

విండోస్ వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది. విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా అప్ డేట్ ను ఇన్ స్టాల్…

Read More

గగనతలంలో తప్పిన పెను ప్రమాదం..525 మందిని కాపాడిన పైలట్లు

-బ్రిటన్‌ విమానాన్ని ఢీకొనే పరిస్థితిని నివారించిన శ్రీలంక పైలట్లు కొలంబో: శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని పైలట్ల అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది.రెండు విమానాలు ఢీకొనే పరిస్థితిని నివారించి 525 మంది ప్రయాణికులను కాపాడినందుకు పైలట్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ సంస్థకు చెందిన యూఎల్‌-504 విమానం ఈ నెల 13న లండన్‌ నుంచి కొలంబోకు 275 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తుర్కియే గగనతలంలో 33 వేల…

Read More

ఇండియాకు రానున్న దలైలామా

1959 టిబెటన్‌ తిరుగుబాటు ప్రారంభంలో తమ ప్రాణాలను కాపాడుకోడానికి దలైలామా, ఆయన పరివారం ఆ ఏడాది మార్చి 30 న భారతదేశంలోకి ప్రవేశించి, ఏప్రిల్‌ 18న అస్సాంలోని తేజ్‌పూర్‌కు చేరుకున్నారు.నాటి నుంచీ దలైలామా ఇండియాలో ఉంటున్నారు. గుజరాత్‌లో 2010లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్‌ కాన్ఫరెన్స్‌’లో ఆయన మాట్లాడుతూ….. ‘పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్‌ది, ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని, భారతమాత పుత్రుడిని’ అన్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్‌ పురస్కార గ్రహీతలలో 14వ దలైలామా ఒకరు. శాంతి, అహింసా…

Read More

ప్రవక్తపై వ్యాఖ్యలు భారత్ ఆంతరంగిక విషయం

– బంగ్లా మంత్రిహసన్ మహమూద్ ఢాకా: మహమ్మద్ ప్రవక్తను అవమానించేటట్టు వ్యాఖ్యలు చేశారని చెలరేగిన వివాదం భారతదేశ అంతర్గత విషయమని, ఢాకాలోని ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రి డాక్టర్ హసన్ మహమూద్ స్పష్టం చేశారు. “మొదట, ఇది బాహ్య సమస్య (బంగ్లాదేశ్‌కు సంబంధించి). ఇది భారతదేశ సమస్య, బంగ్లాదేశ్‌కు సంబంధించినది కాదు. మేము ఏమీ చెప్పనవసరం లేదు”, అని మహమూద్ ఢాకాలో సందర్శిస్తున్న భారతీయ జర్నలిస్టుల బృందంతో అనధికారిక ఇంటరాక్షన్‌లో…

Read More

ఐక్యరాజ్య సమితి విఫలంతోనే కొత్త గ్రూపులు

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ విశాఖ‌ప‌ట్నం: ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడంతోనే మధ్యలో జీ7, జీ20 గ్రూపులు పుట్టుకొచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. చైనా దేశం సరిహద్దు చట్టాలు, ఒప్పందాలను మీరిందన్నారు. అయినప్పటికీ వాణిజ్య వ్యవహారాల మధ్య ఎక్కడా ఇబ్బంది రాకుండా చూశామన్నారు. విశాఖలో ‘భారత ఎనిమిదేళ్ల విదేశాంగ విధానం’పై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని తీసుకువచ్చేందుకు మన దేశం చేసినట్టు…

Read More

ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే: సినీ నటుడు అలీ

– మెల్ బోర్న్ లో వైసీపీ మహా గర్జన కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన అలీ – జగన్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ కొనియాడారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్ దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ…

Read More

చైనాకు మళ్లీ కరోనా కలవరం

– కరోనా గాలి వీస్తోంది.. తలుపులు మూసి ఉంచండి – అధికారుల వింత ఆదేశాలు ఉత్తర కొరియాలో కరోనా ఉద్ధృతి.. చైనాను బెంబెలెత్తిస్తోంది. దీంతో తమ కొవిడ్ జీరో వ్యూహానికి ఇబ్బంది రాకుండా అక్కడి అధికారులు వింత ఆదేశాలు ఇస్తున్నారు.ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కొవిడ్ గాలి నుంచి రక్షించుకునేందుకు సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ గాలి ద్వారా చైనా వైపునకు మహమ్మారి ప్రయాణిస్తుందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఓ ఆంగ్ల మీడియా…

Read More

ట్రయల్స్‌లోనే కేన్సర్‌ను ఖతం చేసిన డ్రగ్

-వైద్యచరిత్రలో అద్భుతం వాషింగ్టన్: సాధారణంగా- ఓ డ్రగ్‌ను అభివృద్ధి చేసినప్పుడు.. పేషెంట్ల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌ను డెవలప్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్స్ నిర్వహించారు. మూడుదశల్లో ట్రయల్స్‌ను నిర్వహించిన తరువాతే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేలిన తరువాతే ఏ డ్రగ్ అయినా మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. అలాంటి ట్రయల్స్ దశలోనే ప్రాణాంతక…

Read More

అవిశ్వాస తీర్మానంలో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు

-సొంత సభ్యుల నుంచే అవిశ్వాస తీర్మానం..  -‘పార్టీ గేట్’ కుంభకోణం నేపథ్యంలో సొంత పార్టీ నుంచే ఒత్తిడి -59 శాతం మంది చట్ట సభ్యుల మద్దతు పొందిన ప్రధాని సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎదురైన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు తిరుగులేదనిపించుకున్నారు. ‘పార్టీ గేట్’ కుంభకోణం నేపథ్యంలో సొంత పార్టీ సభ్యులే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 148 ఓట్లు…

Read More