సుదీర్ఘ యుద్ధానికి పుతిన్ ఏర్పాట్లు..!

– అమెరికా నిఘావర్గాల నివేదిక.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు.ఇది సుదీర్ఘకాలంపాటు కొనసాగనుంది. క్రెమ్లిన్‌ కూడా దీనికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ యుద్ధంలో రష్యా లక్ష్యాలు అత్యంత ఖరీదైనవని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని నల్లసముద్ర తీరం వరకు రష్యా ల్యాండ్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటు కూడా దీనిలో ఓ భాగమని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ యుద్ధం విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనాలు చాలా వరకు నిజమవుతూ…

Read More

శ్రీలంక ప్రధాని ఇల్లు దగ్దం

– ప్రధాని మహీంద్రా రాజపక్సే రాజీనామా – రివాల్వర్‌తో కాల్చుకున్నఎంపీ అమరకీర్తి అతుకొరాల – మంత్రులు, ఎంపీల ఇళ్ళతో పాటు రాజపక్సే కుటుంబీకులకు చెందిన పూర్వీకుల ఇళ్ళ దహనం – కట్టలు తెంచుకొన్న ప్రజాగ్రహం శ్రీలంక చరిత్రలో తొలిసారిగా జరిగిన తిరుగుబాటు చివరకు దేశ ప్రధాని ఇంటినే తగులబెట్టే పతాక స్థాయికి చేరింది. ఆయన రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారకపోగా, ఆయన పూర్వీకుల ఇళ్లను కూడా దహనం చేసిన ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రధాని మహీంద్రా…

Read More

మన అరవింద్ కృష్ణ కు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ కీలక బాధ్యతలు

ఐబీఎం చైర్మన్, సీఈఓ “అరవింద్ కృష్ణ” కు, కీలక బాధ్యతలు దక్కాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సోమవారం ప్రకటించింది. 2023 డిసెంబరు 31 వరకు కృష్ణ ఈ పదవీలో కొనసాగుతారని న్యూయార్క్ ఫెడ్ తన ప్రకటనలో పేర్కొంది. BM CEO, చైర్మన్‌గా కొనసాగుతున్న కృష్ణ.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ నుండి డిగ్రీ పట్టా పొందారు. అలాగే…

Read More

వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌ షిప్ విజేత మన భారతీయుడే

-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఆసక్తి కలిగించే వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌షిప్ విజేత. అవును. ఇందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు….

Read More

అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలకు మంత్రి తలసానికు ఆహ్వానం

వాషింగ్టన్ లో జులై నెలలో నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ లు సోమవారం మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంతో అమెరికాలో ని తెలుగు వారిని అందరిని ఒకేచోట…

Read More

స్విస్ ప్రజలను చూసి సిగ్గుపడదాం..రండి!

– ఉచిత నగదును వద్దన్న స్విస్ ప్రజానీకం – ఉచితానికి ఓటేసిన వారిని శిక్షించాలన్న జనం ఆ దేశంలో ఉచితంగా లక్షల రూపాయలు ఇస్తామంటే 99.02 % మంది వద్దన్నారు.ఆ దేశం పేరు స్విట్జర్లాండ్.ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని. భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని…

Read More

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎంపిక..హమ్మా…హబ్బా

– పొగిడిన భారత్ మేధావులే ఇప్పుడు పడకేశారు 2017: హబ్బాహ్…. దబ్బాహ్…. జబ్బాహ్….. 2022: మళ్ళీనా నిన్న జరిగిన ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వరుసగా రెండోసారి అఖండ విజయం సాధించాడు. పోయినసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు.. అతనొక వామపక్షవాది అవడంతో.. మేధావులుగా తమను తాము పరిగణించుకొనే.. భారతీయ మీడియాకు చెందిన.. కాంగ్రెస్ పార్టీ పప్పూగాడితో సహా.. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన.. అనేక మంది దిక్కుమాలిన సన్నాసులు.. ఆయన్ను ఆకాశానికెత్తుతూ.. అభినందన సందేశాలు పంపారు. కొందరైతే…

Read More

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నగర విద్యార్ధులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. చికాగో సమీపంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన జరిగింది. పిక్నిక్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో నిజాంపేటలో నివాసముండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ పద్మజా రాణి చిన్న కుమారుడు పీచెట్టి వంశీకృష్ణ(23), అతని స్నేహితుడు పవన్‌ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు….

Read More

“తానా” అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి/రచయిత “జె వి కుమార్ చేపూరి”

తానా ప్రపంచ సాహిత్య వేదిక ” భారతదేశ వజ్రోత్సవ వేడుకలు” పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా ” అంతర్జాతీయ కవితల పోటీలు ” నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాదుకు చెందిన కవి/రచయిత జె వి కుమార్ చేపూరి ఎంపికయ్యారు . ఈ నెల (ఏప్రిల్) 24వ తేదీ తానా నిర్వహించ బోతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సదస్సు “కవితాలహరి” – ప్రపంచ స్థాయి కవితా వేదిక మీద జె వి కుమార్ చేపూరి తమ కవిత…

Read More

కెనడా నుండి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రేపు అనగా 20 ఏప్రిల్. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం అభిమానులు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు చేయనున్నారు. ఈ వేడుకలు నిన్న రాత్రి కెనడాలోని టొరంటో నుండి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు NRI TDP – Canada ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పాల్గొన్నారు. ఈ…

Read More