Home » కరోనా వైరస్ పోలేదు..నేను హాజరు కాలేను: సోనియా గాంధీ

కరోనా వైరస్ పోలేదు..నేను హాజరు కాలేను: సోనియా గాంధీ

తాను కరోనా వైరస్ నుంచి కోలుకోలేదని, తాను విచారణకు హాజరుకాలేనని ఈడీకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంచేశారు. ఇదిలావుంటే సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

రాహుల్ ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొన్నిరోజుల కిందట కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సోనియా ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమె ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈరోజు (జూన్ 8) విచారణకు రావాలంటూ ఇటీవలే ఈడీ సమన్లు పంపింది. ఇదిలావుంటే తనకు ఇంకా కరోనా నెగెటివ్ రాలేదని, తాను విచారణకు హాజరుకాలేనని సోనియా ఈడీకి స్పష్టం చేశారు. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది.

Leave a Reply