Home » అమరావతిలో ఉండే అర్హత జగన్ కు లేదు

అమరావతిలో ఉండే అర్హత జగన్ కు లేదు

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

ప్రజా రాజధాని అమరావతి లోని తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే అర్హత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళి పోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం బెంగుళూరు బంగ్లా కు వెళ్ళిన వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారనే వార్తల నేపథ్యంలో బాలకోటయ్య ఈ ప్రకటన చేశారు.

మూడు రాజధానుల మూర్ఖపు కుంపటిని నెత్తి కెత్తుకుని తిరిగే జగన్ కు అమరావతిలో ఉండే నైతిక అర్హత ఎక్కడిది? అన్నారు.‌ఇప్పటికీ మూడు రాజధానులే మా విధానం అంటూ మాజీమంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన నవ్వి పోదురు గాక నా కేటి సిగ్గు అన్నట్లుగా ఉందన్నారు. 151 స్థానాలతో పాలన చేసిన పార్టీకి రెండు పంగనామాలు పెట్టినట్లు 11 సీట్గు ఇచ్చి, ప్రతి పక్ష హోదా లాగేసి‌నా వైకాపా నాయకుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఖరీదు కలిగిన బంగ్లాలు, ప్యాలెస్ లు నిర్మించుకొని ఐదేళ్ళ పాలనలో నయా నియంతలా సర్వ భోగాలు జగన్ అనుభవించారని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలతో, అభివృద్ధితో ఆటలాడారని చెప్పారు. తలపై ఉన్న మూడు రాజధానుల శని భారాన్ని దించుకోనంత వరకు వైకాపాకు కూటమి పాలనపై మాట్లాడే అర్హత లేదన్నారు.

కేవలం పెంచిన వెయ్యి రూపాయలు ఇవ్వటం చేతకాక, పెంచుకుంటూ పోతాను అంటూ రూ. 250 చొప్పున ఐదేళ్ళు సాగదీశారని, దీనివల్ల దాదాపు రూ.32,000 ఒక్కో లబ్ధి దారుడు నష్ట పోయిన్నట్లు చెప్పారు. చంద్రబాబు రూ.4,000 పింఛన్లు తోపాటు గడిచిన మూడు నెలలకు మరో మూడు వేలు కలిపి ఏడు వేలు చొప్పున మొత్తం 65 లక్షల 18 వేల 496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.

అమరావతిని, పోలవరాన్ని ధ్వంసం చేయటం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయరాని తప్పిదం, తెలుగు జాతికి మహా మోసం చేశారన్నారు. విధానాలను సమీక్షించుకొనే ఓపిక, తీరిక లేనప్పుడు వైకాపా జెండాను దించటం మంచిది అని, లేదా తల్లి కాంగ్రెస్ లో విలీనం చేయటం ఉత్తమం అని బాలకోటయ్య సూచించారు

Leave a Reply