జీవో నెంబర్ వన్ సుప్రీంకోర్టు వెనక్కి పంపడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు

– పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్

ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన చీకటి జీవో నెంబర్ వన్ ను సుప్రీంకోర్టు వెనక్కి పంపడం జగన్ రెడ్డికి చెంపపెట్టు అన్నారు.చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలను, లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి తీసుకు వచ్చిన జీవో నెంబర్ వన్ అన్నారు. మిగిలిన ప్రతిపక్షాలు, సంఘాలు వారు కూడా చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంగా అభివర్ణించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రజలలో జగన్ రెడ్డి ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువైన సందర్భంలో జగన్ రెడ్డి దురాలోచన ఇచ్చిన చీకటి జీవో నెంబర్ వన్ అన్నారు.హై కోర్టు వారు జీవో నెంబర్ వన్ పై 23వ తారీకు వరకు స్టే ఇచ్చినప్పటికీ జగన్ రెడ్డి సైకోలా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం అధికార దుహంకార చర్యగా భావించాలన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన పాదయాత్ర “యువగళం” నికి పోలీసువారి అనుమతి కోరడం జరిగిందని, కానీ ఇప్పటివరకు పోలీసువారు ఎటువంటి అనుమతులు జారీ చేయకపోవడం అనేక సందేహాలకు దారి తీస్తుందన్నారు.

లోకేష్ పాదయాత్ర జరగనున్న జనవరి 27వ తారీఖున జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమాంకం మొదలు అవుతుందన్నారు. జగన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ లోకేష్ “యువగళం”పాదయాత్ర అడ్డుకోలేరని హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు, యువత జగన్ రెడ్డి పాలనలో జరిగిన అన్యాయాలను, తాము పడ్డ బాధలను వ్యక్తిగతంగా కలిసి వివరించుటకు సమాయాత్తం అవుతున్నారు అన్నారు.

లోకేష్ “యువగళం” పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన కార్యక్రమంగా నిలిచిపోతుందని, కావున ఇకనైనా జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను వెనక్కి తీసుకోవాలని, శాంతియుతంగా, గాంధేయ పద్ధతిలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎటువంటి నిర్బంధాలు కలిగించకుండా ఉండాలని, రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తి భద్రత కల్పించాలని కోరారు. లేని పక్షాన ఉన్నత న్యాయస్థానాల అనుమతితో పాదయాత్ర కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకుడు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply