ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్​

కరోనా బారిన పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాలపై వైద్య పరీక్షలు, అబ్జర్వేషన్ నిమిత్తం స్టాలిన్ చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రిలో చేరినట్టు ఆ ఆసుపత్రి యాజమాన్యం గురువారం ప్రకటించింది. స్టాలిన్ కు జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉండటంతో మంగళవారమే టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన నివాసంలోనే ఉండి చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే…

Read More

ప్ర‌ధాని మోడీ హ‌త్య‌కి కుట్ర‌

-పాట్నాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల అరెస్ట్ పాట్నాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..కాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఉగ్ర‌వాదులు ప‌న్నిన కుట్ర‌ని చేధించారు పోలీసులు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని.. ప్రధాని మోడీ రెండో లక్ష్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జూలై 12న ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన్ని లక్ష్యం చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు. అస్థార్ పర్వేజ్, జలూలుద్దీన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్…

Read More

ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నమైది

-ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ -ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది -ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ విషయలోనూ ఏపీ స్ఫూర్తిదాయకం -ముఖ్యమంత్రికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసలు -రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన  -సీఎం సూచనలమేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు అమరావతి: – రాష్ట్రంలో పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి…

Read More

అమర్నాథ్ యాత్రికులను కాపాడండి

అమరనాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో చిక్కుకుపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు, జమ్ము కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా లకు లేఖలు రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. * అమరేంద్రుడు తెలుగు ప్రజల్లో చాలా ప్రసిద్ధి. * ఏపీ నుంచి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని…

Read More

జనాభాలో నంబర్ 1 స్థానానికి భారత్

-2023లో చేరుకుంటుందన్న ఐక్యరాజ్యసమితి నివేదిక -ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు -భారత్ లో జనాభా 141.2 కోట్లు -2050 నాటికి భారత్ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలు జనాభా పరంగా భారత్ 2023లో చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఐక్యరాజ్యసమితి సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులోని అంశాలను పరిశీలించినట్టయితే.. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా సంఖ్య 800 కోట్ల మార్క్…

Read More

విజయ్‌ మాల్యాకు చుక్కెదురు: జైలు శిక్ష, జరిమానా

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు…

Read More

పన్నీర్ సెల్వంకు హైకోర్టు షాక్..పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..

చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్‌ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్‌( ఒ.పన్నీర్‌ సెల్వం) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆ పార్టీ అగ్రనేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈపీఎస్‌ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతులిచ్చింది. దీంతో మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత…

Read More

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త…..

73 లక్షల మందికి ఒకేసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతీ నెలా పెన్షనర్లకు పెన్షన్ విడుదల చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు ఉన్న 138 రీజనల్ ఆఫీసుల ద్వారా పెన్షనర్లకు పెన్షన్ విడుదలవుతూ ఉంటుంది. అంటే రీజియన్ల వారీగా పెన్షన్ వేర్వేరు సమయాల్లో విడుదలవుతూ ఉంటుంది. దేశమంతా ఉన్న పెన్షనర్లకు ఒకేసారి డబ్బులు జమ కావట్లేదు. ఈపీఎఫ్ఓ కొత్తగా సెంట్రల్ సిస్టమ్ రూపొందించింది. ఈ సిస్టమ్ ద్వారా 73 లక్షల మంది పెన్షనర్లకు ఒకేసారి…

Read More

అమర్​నాథ్ వరదల్లో 15 మంది మృతి..

-యాత్ర తాత్కాలికంగా నిలిపివేత -వరదల్లో 40 మందికి పైగా కొట్టుకుపోయినట్లు అధికారుల వెల్లడి -కొనసాగుతున్న సహాయక చర్యలు -నిన్న సాయంత్రం కుండపోత వర్షంతో యాత్రకు అంతరాయం పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద భారీ వర్షం, కొండల పైనుంచి వస్తున్న వరదల్లో చిక్కుకొని ఇప్పటిదాకా 15 మంది యాత్రికులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా…

Read More

వరద ప్రవాహంలో నా కళ్లముందే ఎంతోమంది కొట్టుకుపోయారు..

– అమర్‌నాథ్ విలయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్‌నాథ్ యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకుపడిన వరద కారణంగా 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ఆయన తన కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ వెళ్లాలని…

Read More