నెలకు 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..:పంజాబ్​ సీఎం ప్రకటన

పంజాబ్ రాష్ట్రంలో నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. శుక్రవారం నుంచే ఈ ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు తెలిపారు. మరో హామీ అమల్లోకి తెస్తున్నాం.. ‘‘గతంలో పాలించిన పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండానే ఐదేళ్ల…

Read More

ఐటీ శాఖ నుంచి ప్రేమలేఖ అందింది:శరద్ పవార్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రెబెల్స్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది. నిన్న రాత్రి ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తనకు ప్రేమలేఖ అందిందని…

Read More

నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ దేశంలో పలు చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని… అందువల్ల అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు…

Read More

ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న ఎంఐఎం

-ఒక్కసారి అవకాశం కల్పించండి -బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలుకానీయకుండా అడ్డుకుంటున్న ఎం ఐ ఎం కు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బు ధ్వజమెత్తారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎం ఐ పార్టీకి చెందిన వాళ్లే అయినా పాతబస్తీని ఎందుకు అభివృద్ది చేయడం లేదని ప్రశ్నించారు. జులై 2,3 తేదీలలో జరుగనున్న బీజేపీ జాతీయసమావేశాల సందర్బంగా బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బును చార్మినార్…

Read More

ఆసుపత్రి పడకలపైనా జీఎస్టీ బాదుడు..

ఆసుపత్రి పడకలపై 5 శాతం జీఎస్టీని విధించడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.5,000కు పైగా చార్జీ ఉండే పడకలకు ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడం అవుతుందని పేర్కొంటున్నారు. హెల్త్ కేర్ సంస్థల సమాఖ్య న్యాట్ హెల్త్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ‘‘కీలకమైన వైద్య సేవలపై కేవలం నామమాత్రపు జీఎస్టీని విధించాలి. అదే సమయంలో హెల్త్…

Read More

ఫడ్నవీస్ పాత్రపై అసోం సీఎం హిమంత ప్రశంసలు

మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కాగా.. దీని వెనుక చక్రం తిప్పిన వారిలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ షిండే, తన మద్దతుదారులతో వారం రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలోని ఓ స్టార్ హోటల్లో బస చేయడం తెలిసిందే. వారు ఉన్నన్నాళ్లూ బయటి వ్యక్తులను ఎవరినీ హోటల్లోకి అనుమతించ లేదు. ఒక్క అసోం సీఎం మాత్రమే పలు మార్లు వెళ్లి మంతనాలు నిర్వహించారు….

Read More

2017-22 లో ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణ ఖర్చులు రూ. 62 కోట్లు!

2017-18 నుంచి 2021-22 మధ్య ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీల రైలు ప్రయాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 62 కోట్లు భరించింది. ఈ మొత్తంలో ప్రస్తుత లోక్‌సభ ఎంపీల ప్రయాణాల ఖర్చు రూ. 35.21 కోట్లు, మాజీ ఎంపీల ఖర్చు రూ. 26.82 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణాల కారణంగా ఖజానాపై పడుతున్న భారమెంతో చెప్పాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార…

Read More

మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

ఈ నెల 2, 3వ తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కీలక నాయకులు నగరానికి వస్తున్నారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరిగే ఈ సమావేశాల కోసం శనివారం హైదరాబాద్ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు నగరంలోనే ఉంటారు. హైదరాబాద్ లో తొలిసారి జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంతో…

Read More

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌…

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ముగింపు దిశ‌గా అడుగులు ప‌డుతున్న త‌రుణంలో గురువారం రాత్రి మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర సీఎంగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేయడానికి కాస్తంత ముందుగా బీజేపీ అధిష్ఠానం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షిండే స‌ర్కారులో బీజేపీ పాలుపంచుకోవాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నుంచి…

Read More

పీఎస్ ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది.రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్ డౌన్‌ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన పిదప వాహకనౌక నింగిలోకి పయనించింది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌…

Read More