Home » కవిత మహిళా ద్రోహి

కవిత మహిళా ద్రోహి

– మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ప్రగతి భవన్ నుంచి సీఎం ఏడు అడుగులు వేసి రాజ్ భవన్ కు వెళితే బిల్లులు ఆమోదం పొందేవి.ఏడు అడుగులు వేసే ఓపిక తీరిక సీఎం లేకుండా పోయింది.రాజకీయం చేయాలనే దురుద్దేశంతో బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్లారు.గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో మంత్రులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి బిల్లులు, బస్సు ఛార్జీలు పెంచింది.కరెంటు వినియోగించకుండా.. నీటిని వాడకుండా మంత్రులు ఉంటారా?బీజేపీ వాళ్లు చెబితేనే అరెస్టు చేస్తారంటా.. ఇక విచారణ సంస్థలు ఎందుకనీ కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుతున్నారు.మద్యం కుంభకోణంలో సాక్ష్యాలు ధ్వంసం చేసిందనీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న విషయం గుర్తు లేదు.

కవితే మద్యం కుంభకోణంలో పెట్టుబడిదారీ, మధ్యవర్తి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.మద్యం కుంభకోణంను రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాత్యాలు, అవమానులు జరుగుతుంటే కవిత స్పందించలేదు.గవర్నర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించి కవిత, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉంది.

Leave a Reply