రేపు కేసీఆర్‌ అటు..మోదీ ఇటు

-రేపు ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్‌!.. మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు మోదీ! -ఇటీవలే ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌ -తాజాగా గురువారం బెంగ‌ళూరుకు ప‌య‌నం -మోదీకి స్వాగ‌తం చెప్ప‌నున్న మంత్రి త‌ల‌సాని -2:30 గంట‌ల పాటు హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌… తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్ ప‌య‌నం కానున్నారు. ప‌లు పార్టీల‌తో మంత‌నాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవ‌లే ఢిల్లీ, ఛండీగ‌ఢ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన…

Read More

యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష!

కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. ఉగ్రవాదులకు, సంఘ విద్రోహ శక్తులకు నిధులు అందించారనే కేసులో శిక్షను ఖరారు చేసింది. యాసిన్ మాలిక్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. ఇదే సమయంలో శిక్షను విధించేటట్టయితే జీవిత ఖైదును విధించాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును విన్నవించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు… ఈరోజు శిక్షను వెలువరించింది. యాసిన్ కు జీవిత ఖైదును విధించింది. మరోవైపు యాసిన్ మాలిక్…

Read More

కాంగ్రెస్ కు కపిల్ సిబల్ గుడ్ బై..

కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా సమర్పించారు. ఎవరూ ఊహించని చర్యతో షాకిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ (ఎప్పీ) మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిబల్ వెంట ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని డిమాండ్ చేస్తూ, పార్టీకి దూరంగా ఉంటున్న జీ23 (గ్రూపు 23) నేతల్లో కపిల్ సిబల్…

Read More

సద్గురుతో మంత్రి తారకరామారావు సంభాషణ

-వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నేపథ్యంలో సద్గురు తో మంత్రి తారకరామారావు సంభాషణ – సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ పై చర్చ దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా save soil పేరుతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు సద్గురు. రెండు రోజులపాటు దావోస్లో ప్రపంచ స్థాయి కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులోభాగంగా అత్యంత కీలకమైన ప్రభుత్వాధినేతలు,…

Read More

దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆదిత్య థాకరే

మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్ మరియు పంచాయతీ చట్టాల్లో 10…

Read More

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

-బస్సు, లారీ ఢీ.. 7 మంది మృతి, 26 మందికి గాయాలు! కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హుబ్లీ నగర శివార్లలో ఓ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. ఇదే విషయాన్ని కర్ణాటక పోలీసులు తెలియజేశారు. కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొన్నట్లు పోలీసులు తెలిపారు. ధార్వాడ్ వైపు వెళ్తోన్న లారీని బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే…

Read More

జ‌పాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా అధినేత‌ల‌తో మోదీ భేటీ..

జ‌పాన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు భార‌త ప్ర‌ధాని మోదీ ఆ దేశానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రుగుతోన్న‌ ఈ స‌మావే‌శంలో క్వాడ్ దేశాల అధినేత‌లు పాల్గొన్నారు. మోదీతో పాటు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, జ‌పాన్ ప్ర‌ధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్ర‌ధాని అల్బ‌నీస్ ఈ స‌మావేశంలో పాల్గొని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇండో ప‌రిఫిక్ ప్రాంతంలో ప‌రిణామాలు, అంత‌ర్జాతీయ అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు. అలాగే, ప్ర‌ధానంగా ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం, క్వాడ్…

Read More

గ్యాస్ సిలిండర్​ మరింత భారం

గ్యాస్​ సిలిండర్​ రీఫిల్​ ధర మళ్లీ పెరిగింది. విపరీతమైన ట్యాక్స్​లు, జీఎస్టీతో ప్రజలను కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీస్తోంది. మొన్నటిదాకా కరోనా మహమ్మారి బయటకు వెళ్లకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం జనాల బతుకులపై దాడి చేస్తోంది. ఆయిల్​ రేట్లు కేజీ 200 దాటాయి, పెట్రో రేట్లు లీటర్​ 119 దాటాయి, గ్యాస్​ రేట్లు వెయ్యి రూపాయలు దాటాయి.. ఇప్పుడు మళ్లీ రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం.. ఇట్లా ప్రతీది పెంచుకుంటూ…

Read More

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది

• అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న జాతీయ ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపు • విద్య, అభివృద్ధికి అందించే ప్రోత్సాహం మార్పునకు అత్యంత కీలకం • ప్రపంచంలో ఉన్నతశ్రేణి దేశాల్లో ఒకటిగా అవతరించగల సామర్ధ్యం భారత్ సొంతం • నూతన జాతీయ విద్యావిధానం – 2020 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది • ప్రపంచ దేశాల సరసన భారతదేశం విశ్వగురువు హోదాను తిరిగి నిలబెట్టుకునేలా యువత కృషి చేయాలని సూచన* • తమిళనాడు…

Read More

రాహుల్ తో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ..

-హార్దిక్ పటేల్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ ఇటీవల నిరసన గళం విప్పిన గుజరాత్ కాంగ్రెస్ యువ నేత హార్దిక్ పటేల్ భవితవ్యం మరో రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది. ఇంకో రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు హార్దిక్ పటేల్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ హార్దిక్…

Read More