ఛీ..చైనా..!!

అటు సరిహద్దులలో
చోరబాటన చొరబాటుకు..
ఇటు ప్రతి ఇంటి వాకిలిలో
మృత్యుఆకలితో విషకాటుకు..
నీకుగా మోహరించిన సేన..
నువ్వుగా సృష్టించిన కరోనా..
ఎంతటి ఘాతుకానికి తెగబడుతున్నావు
ఓ చైనా..
నీకు నీలాంటి
మరో దోస్తు పాకిస్తానా..!

మూడేళ్లకు మునుపు
నువ్వే పురుడు పోసిన వైరస్..
పాకిస్తాన్ అందిస్తున్న కోరస్ దశాబ్దాల నాటి వైరం..
తిరిగదోడి రేపుతున్నావు దుమారం..
హతమయిందా
నీ చేతిలో
శాంతి పావురం..
అసలు మారదా నీ బుద్ధి..
ఎన్నిసార్లు జరిగినా దేహశుద్ధి..
కట్టేసావు ఎప్పుడో అడ్డుగోడ..
అయినా మాకు
వదలదా నీ దాడుల పీడ..!

విమానాలలో
మనుషుల ద్వారా
పంపావు కరోనా..
సరిహద్దుల్లో
గప్చిప్పుగా
ఆయుధాల రవాణా..
నీకు..పాకిస్తానుకు
ఇదేనా అజెండా..
పుణ్యభూమిపై కుట్రలు చెయ్యడమేనా ఎడాపెడా..
ఓ వైపు నీ కరోనా కాటు..
మరోవైపు దాయాది
నిరంతర వెన్నుపోటు..
టెర్రరిజమే దాని ఇజం..
ఎన్నిసార్లు శాంతియత్నం
చేసినా మారలేదు
దాని నైజం..
బస్సులో వెళ్ళినా వాజపేయి..
కస్సుబుస్సులాపలేదు పొరుగున సిపాయి..!

ఎన్నెన్ని ఘాతుకాలు..
ఎప్పటికప్పుడు పాతకాలు..
ఒకవైపు సంప్రదింపులు..
మరోవైపు కవ్వింపులు..
మాకు రాలేదు విసుగు..
పాక్ తొలగించలేదు
తీవ్రవాద ముసుగు..
ఇప్పుడు నీ వంతు..
జగమెల్లా తిట్టిపోస్తున్నా
తీరు మారదే..
తెలిసిన దారి అదే..
ప్రాణాంతక క్రిమిని సృష్టించి
విమానాల్లో దట్టించి..
ప్రపంచం మీదకు వదిలిన
నీకు మరణమృదంగం
వినిపిస్తోందా శ్రావ్యంగా..
శవాల సింహాసనంపై
వేస్తావా పాగా..!

మా డబ్బులు తిని
జబ్బులు పంపిస్తావా..
ఇంకెన్నాళ్ళులే నీ ఆటలు..
అందరికీ నీపై కోపం పీకలదాకా..
నువ్వే లాగావు
తాడు తెగేదాకా..
పాపం పండింది..
అంతం ఆరంభం అయినట్టే..
నీ పతనానికి
ఈ భరతభూమే సారధి..!

పాంచజన్యం రణనినాదం
చేయక ముందే..
తేరుకో..బుద్ధి మార్చుకో..
లేదంటే అయ్యేది
గాయం కాదు..
ప్రపంచపటంలో
నువ్వు మాయం..
చరిత్రపుటల్లో
నువ్వు నికృష్ట చరితగా
మిగిలిపోవడం ఖాయం..

-సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply