విచారణ పేరుతో జగన్ రెడ్డి, సజ్జల చెప్పినవారినే సీఐడీ వేధిస్తోంది

• సీఐడీ చీఫ్ దృష్టిలో, చట్టబద్ధంగా పనిచేయడమంటే, అధికారంలో ఉన్నవారి ఆనందంకోసం అమాయకుల్ని హింసించడమా?
• జగన్ రెడ్డి, సజ్జల చెప్పినవారిని అరెస్ట్ చేసి, హింసించడమేనా సీఐడీ చెబుతున్న నిబంధన?
• నేరంలేకపోయినా, విచారణపేరుతో వేధించడమేనా సీఐడీ చీఫ్ చెబుతున్న ఐపీసీ సెక్షన్లు?
– గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్

అధికారంలో ఉన్నవారి ఆనందంకోసం పనిచేస్తున్న సీఐడీవిభాగం, అమాయకుల్ని, ప్రతిపక్షనేతల్ని, ప్రభుత్వపనితీరుని ఎత్తిచూపుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిని లక్ష్యంగా చేసుకొని, కోర్టు ఆదేశాలను బేఖాతరుచేస్తూ, పనిగట్టుకొనిమరీ పగసాధిస్తోందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “రాష్ట్ర సీఐడీ పనితీరుచూస్తే రాష్ట్రంలో ఏ శాఖకు రానంత అప్రతిష్ఠ, చెడ్డపేరు వచ్చాయనే చెప్పాలి. తప్పు(నేరం) లేకపోయినా, విచారణపేరుతో జగన్ రెడ్డి, సజ్జల చెప్పినవారినే సీఐడీ వేధిస్తోంది. సీఐడీవారికి జీతాలు వైసీపీ నేతలు, ఆపార్టీ నుంచి రావడంలేదు. వాస్తవాలు కప్పిపుచ్చి జనాల్ని మభ్యపెట్టడానికే సీఐడీ తప్పుడు ప్రకటనలు ఇచ్చింది. చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి, సిగ్గులేకుండా అధికారపార్టీ నేతల్లా సీఐడీవిభాగం ఒక పత్రికాప్రకటన ఇస్తే సరిపోతుందా? సీఐడీ విభాగాధిపతి రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఉద్యోగానికి రాజీనామాచేసి, నేరుగా రావచ్చు. చట్టబద్ధమైన పదవిలో ఉండి, అధికారంలో ఉన్నవారి ఆనందంకోసం పనిచేస్తూ, అమయాకుల్ని వేధించడం ఏమిటి? ముద్దాయిలకు నేరస్తులకు సీఐడీ చీఫ్ కి తేడాతెలియదా? ఆయనపై కూడా కేసులున్నాయికాబట్టి, ఆయన నేరస్తుడా.. ముద్దాయా? ప్రభుత్వ పెద్దలు కాపాడతారన్న ధైర్యంతో ఇష్టానుసారం వ్యవహరిస్తూ, చేస్తున్న తప్పులనుంచి ఆయన ఎప్పటికీ తప్పించుకోలేరు.
నలంద కిశోర్ మొదలు దారపనేని నరేంద్రవరకు సీఐడీ వ్యవహరించిన తీరు చట్టబద్ధమా?

కోవిడ్ సమయంలో నలందకిశోర్ ని విచారించిన తీరు, సీఐడీ విభాగానికి మాయని మచ్చకాదా? వైసీపీఎంపీ రఘురామకృష్ణంరాజు, టీవీ.5 ఛానెల్ యజమాని బీ.ఆర్.నాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుల విషయంలో సీఐడీ మితిమీరి వ్యవహరించలేదా? అక్రమంగా బంగారం తరలిస్తూ, విమానాశ్రయంలో ఓ మహిళ పట్టుబడిన విషయం వాస్తవంకాదా? అదే అంశంపై అంకబాబుని విచారించినవారు, మరలా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను ఎందుకు అరెస్ట్ చేశారు? అతన్ని వేధించి, చిత్రహింసలకు గురిచేసి, ఎవరిపేరుచెప్పించాలని ప్రయత్నించారు? సీఐడీ టార్చర్ తట్టుకోలేకనే నలందకిశోర్ చనిపోయారు. సీఐడీ వారు తనను కొట్టారని స్వయంగా రఘురామకృష్ణంరాజే న్యాయమూర్తికి చెప్పుకోలేదా?

రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా కొట్టి, మరలా కొట్టలేదని సీఐడీ బుకాయించలేదా? గుంటూరు జనరల్ ఆసుపత్రిలో తప్పుడు నివేదిక ఇప్పించి, వారి తప్పుని కప్పిపుచ్చుకోవాలని అధికారులు చూడలేదా? రఘురామరాజుని పరీక్షలకోసం మిలటరీ ఆసుపత్రికి పంపించాక అసలు వాస్తవం బయటకు వచ్చింది. గార్లపాటి వెంకటేశ్, వెంగళరావులపై పాల్పడిన వేధింపుల సంగతేమిటి? రాజధానిలో అసైన్డ్ భూములు కొన్నావారి పేర్లుచెప్పాలంటూ, ఆప్రాంత రైతులను బెదిరించడం ఎలాంటి విచారణ? దళిత జేఏసీ నేతల్ని విచారణపేరుతో భయపెట్టి, కొందరి పేర్లు చెప్పమని సీఐడీ కోరలేదా? టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, పట్టాభి లాంటి వారిని సీఐడీ వేధించి, హింసించలేదా? రంగనాయకమ్మ గారిని మానసికంగా కొన్నిగంటలపాటు హింసించి కోర్టుతో చీవాట్లు తినలేదా?

సీఐడీ పెట్టేకేసులు, పనిగట్టుకొని మోపే సెక్షన్లు కోర్టుల్లోఎందుకు నిలబడటం లేదు?
ప్రభుత్వ పెద్దలు, పాలకులు చెప్పినట్టు నడవడమేనా సీఐడీ చెబుతున్న ఐపీసీ నిబంధన? ఐపీసీ సెక్షన్ 153(ఏ), 505(2) కిందనే ఎందుకు కేసులుపెడుతున్నారు? భావప్రకటనాస్వేఛ్ఛలోభాగంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, కులాలు, మతాలు, వర్గాలమధ్య చిచ్చుపెట్టడం ఎలా అవుతుంది సీఐడీ చీఫ్ గారు? సీఐడీ పెట్టే సెక్షన్లు, పనిగట్టుకొని మోపే కేసులు కోర్టుల్లో ఎందుకు నిలబడటం లేదో సీఐడీ అధికారులుచెప్పాలి. ఎవరి కళ్లల్లోనో ఆనందంకోసం సీఐడీపనిచేస్తోంది తప్ప, నిజంగా సమాజంకోసం కాదు.

అర్థరాత్రో, తెల్లవారుజామునో అరెస్ట్ చేయమని, రాత్రిపూట జడ్జిఎదుట ప్రవేశపెట్టమని ఏ చట్టం సీఐడీకి చెప్పింది? ఏ నిబంధనల ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారిని, సీఐడీ విభాగాధిపతి విచారించారు? అరెస్ట్ చేయడానికి వెళ్లేటప్పుడు సీఐడీ అధికారులు యూనిఫామ్, నేమ్ బ్యాడ్జ్ లేకుండా ఎందుకు వెళుతున్నారు? అలా వెళ్లడం నిబంధనలు పాటించడమా? నోటీసులివ్వడానికి వెళ్లి, ఇళ్లలో ఉండే పనిమనుషులు, చిన్నపిల్లలపై ప్రతాపం చూపడం ఎలాంటి నిబంధనో సీఐడీ చెప్పాలి. అదుపులోకి తీసుకున్నవారిని కొట్టమని ఏ చట్టం సీఐడీకి చెప్పింది? ముద్దాయికి, నేరస్తుడికి తేడాతెలియకుండా సీఐడీ వ్యవహరిస్తోంది. నేరం రుజువై, ముద్దాయిలకు శిక్షపడితేనే వారు నేరస్తులు అవుతారు.తప్పుడువ్యక్తుల్ని, తప్పుడుస్థానంలో కూర్చోబెట్టి, వైసీపీప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని, అందుకు తగినమూల్యం చెల్లించుకుంటుంది” అని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు.

Leave a Reply