Home » రేవ్‌ పార్టీ కేసులో విచారణకు హేమ డుమ్మా

రేవ్‌ పార్టీ కేసులో విచారణకు హేమ డుమ్మా

-జ్వరంగా ఉంది..విచారణకు రాలేను!
-సమయం కావాలంటూ పోలీసులకు లేఖ
-వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వేడుకోలు
-తిరస్కరించిన పోలీసులు..మళ్లీ నోటీసుల జారీకి ప్రయత్నం

బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. తనకు కొంత సమయం కావాలంటూ బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశా రు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానంటూ వేడుకోగా ఆమె విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. మరోసారి విచారణకు రావాలంటూ మళ్లీ నోటీసులు పంపనున్న ట్లు సమాచారం. ఈ కేసులో హేమతో సహా డ్రగ్‌ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధా రణ అయిన 86 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నుంచి బెంగళూరు సీసీబీ కార్యాలయంలో విచారణ మొదలైంది.

Leave a Reply