ఇలాంటి ప్రజాస్వామ్యమేనా కేసీఆర్ కోరుకుంటున్నది?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ధర్నా చౌక్ ఉన్నదే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సంఘాలు 317 జిఓ రద్దు తోపాటు పలు డిమాండ్లతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్ష వర్ధన్ రెడ్డి తో పాటు పలువురిని పోలీసులు అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి వాటికోసమే హక్కులను హరించేందుకు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు.

కేసీఆర్ నియంతృత్వ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాడు.. కేసీఆర్ నియంతృత్వ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నాడు. ప్రజలు ఈ నియంతృత్వ పాలనపై తిరగబడి ప్రజా పాలన ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయి.

ముఖ్యంగా సర్వీస్ రూల్స్ లేక ఉపాధ్యాయుల ప్రమోషన్లు లేక ఎక్కడి వారు అదే స్థాయిలో పదవి విరమణ పొందుతున్నారు. రాష్ట్రంలో అనేక మండల విద్యాధికారి పోస్టులు డిప్యూటీ డిఇఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీల లేవు.కస్తూరిబాలో పనిచేసే మహిళా ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పటికే తీరలేదు వందలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నప్పటికీ కనీస విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టలేదు. పండిట్ల ప్రమోషన్లు ఎన్నికల అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారు.ప్రైమరీ పాఠశాలలో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మార్చాలని నియంతృత్వ పోకడలకు పోతున్న కెసిఆర్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు.

Leave a Reply