Home » 27న కృష్ణ పెద్ద కర్మ.. అభిమానులను కలవనున్న మహేశ్ బాబు

27న కృష్ణ పెద్ద కర్మ.. అభిమానులను కలవనున్న మహేశ్ బాబు

– హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో పెద్ద కర్మ
– అంత్యక్రియల రోజున చివరిచూపు చూసుకోలేకపోయిన చాలా మంది అభిమానులు
– దీంతో అభిమానులను కలవాలనుకుంటున్న మహేశ్ బాబు

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ రాబోయే ఆదివారం (27వ తేదీ) జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మహేశ్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేశ్ బాబు అభిమానులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. కృష్ణ అంత్యక్రియల రోజు ఆయనను చివరిసారిగా చూసుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు పద్మాలయా స్టూడియోస్ కు వచ్చారు. అయితే చాలా మంది ఆయనను కడసారి చూసుకోలేకపోయారు. దీంతో, పెద్ద కర్మ రోజున అభిమానులను మహేశ్ బాబు కలవాలనుకుంటున్నారు.20221123fr637de7b69a563

Leave a Reply