Home » Devotional » Page 30
అఖండ చైతన్యం

అఖండ చైతన్యం

మానవ దేహం మోక్షానికి ద్వారం అని పెద్దలు చెప్తారు. ఐతే ఇది సార్థకం చేసుకోవటానికి ఏ జ్ఞానం తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకున్నప్పుడు మళ్ళీ అనేక జన్మలు పొందవలసి వుంటుంది. అల్పమైన, అశాశ్వతమైన కోరికలతో సతమతమౌతూ మానవ జీవితం యొక్క విశిష్టత గుర్తించ కుండా సుదీర్ఘమైన ఈ ప్రయాణానికి గమ్యం ఏదో, గమ్యం చేరాలంటే ఏ ప్రయత్నం చేయాలో తెలుసు కోకుండా ఇతర జంతువుల వలెనే శరీర పోషణ కోసమూ, దేహ సౌఖ్యాల కోసమూ,…

Read More
పరమాత్మ ఎక్కడ!?

పరమాత్మ ఎక్కడ!?

మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు? ఉన్నా ఎందుకు కనబడుటలేదు? ఆయన్ని ఎలా దర్శించు కోవాలో శ్వేతాశ్వతరోపనిషత్ తెలియ జేస్తుంది. తిలేషు తైలం దధినీవ సర్పిరాపః స్త్రోతఃస్వరణీషు చాగ్నిః । ఏవమాత్మాఽఽత్మని గృహ్యతేఽసౌ సత్యేనైనం తపసా యోఽనుపశ్యతి ॥ నువ్వులలో నూనె లాగా(తిలతైలన్యాయం), పెరుగులో నెయ్యి లాగా, భూగర్భంలో జలప్రవాహం లాగా, అరణిలో నిప్పు లాగా, బుద్ధిలో పరమాత్మ దాగి ఉన్నాడు. పరమాత్మ సర్వ వ్యాపకుడు – తిలతైల న్యాయం పెరుగులో నెయ్యి ఉంటుంది కానీ మధనం చేస్తేనే…

Read More
మృత్యువు – మృత్యుంజయ హోమం

మృత్యువు – మృత్యుంజయ హోమం

“మృత్యుంజయ హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” మహాస్వామివారు నోటి నుండి వచ్చిన మాటలు. అవును ఖచ్చితంగా ఇంకో వందేళ్ళు బ్రతుకుతాడు అతను. పరమాచార్య స్వామివారు నేరూర్ సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్ళారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే మహాస్వామి వారికి చాలా భక్తి, గౌరవం. కేవలం వారి పేరు వింటేనే చాలు స్వామివారు పొంగిపోయేవారు. వారి కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయేవి. మహాస్వామివారు అధిష్టానం ముందు…

Read More
అష్ట సిద్ధులు

అష్ట సిద్ధులు

హిమాలయాలలో , దక్షిణమున నల్లమల అడువుల్లోని శ్రీశైల శిఖర ప్రాంతాన గొప్ప గొప్ప యోగులు ఉన్నారు . వారికి తెలియని విద్యలు అంటూ ఏమి లేవు . అణిమ అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట . మహిమ బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట. లఘిమ దూది కంటే తేలిక అయ్యి ఉండుట….

Read More
ఈ హనుమ నల్లనివాడే!

ఈ హనుమ నల్లనివాడే!

– శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఊరుకొండపేట గ్రామం అతి బలవంతుడూ, అమిత పరాక్రమశాలీ అయిన హనుమంతుడు భక్తులకు కొండంత అండ. ఇక నిండుకాషాయ వర్ణంలో ఉండే సిందూరాలంకరణ ఆ రూపపు ప్రత్యేకత. అయితే ఆ సింధూరపు అలంకరణ ప్రసక్తేలేని ఆలయమూ ఒకటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఊర్కొండ మండలం, ఊర్కొండపేట గ్రామం ఆ హనుమంతుడి ఆలయానికి చిరునామా. శ్రీరామదూత హనుమంతుడు ప్రభుభక్తికి ప్రతిరూపం. అంతేకాదు, ఆయన్ను తలచుకుంటే చాలు శత్రుభయమేంటి, భూతప్రేత పిశాచాల భయమూ వదిలి పోతుందట. అందుకే…

Read More
బ్రహ్మ .. కాలభైరవ స్వరూపం..

బ్రహ్మ .. కాలభైరవ స్వరూపం..

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా…

Read More
ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు

ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు

(స్మరణ భారతి) ప్రకృతిలో పరమాత్మతత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్ష్యాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రసాదించిన సహజగుణంలోనే ఉంటూ, సృష్టికర్త సందేశాన్ని తెల్పుతాయి. అవన్నియూ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తునే వుంటాయి. భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు, పువ్వు…. అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను…

Read More
మార్గశిర మాసం విశిష్టత

మార్గశిర మాసం విశిష్టత

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా…

Read More
పాత దీపాలను పడవేయకండి

పాత దీపాలను పడవేయకండి

దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు, ఎపుడో ఒకసారి దీపాలు పెట్టె వాళ్ళు ఎలా చేసుకున్న పర్వాలేదు. కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్లు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు. మరి పాతవి దేవుడి ముందు బాగాలేదు అనుకుంటే, అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి. లేదా కాలం చేసిన పెద్దవారి ముందు అయినా పెట్టండి. కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి. ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో…

Read More
మార్గశిర మాసం -ముక్తికి మార్గం

మార్గశిర మాసం-ముక్తికి మార్గం

– డా. యం. ఎన్. చార్య ( “మార్గశీర్షమాసం” సందర్భంగా..) డిశెంబరు 5, 2021 నుండి జనవరి 2, 2022 వరకు మార్గశిర మాసం అనగా….. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతియోగంలో – *”మాసానాం మార్గశీర్షంz” మాసాల్లో తాను…

Read More