బీజేపీకి ఓటు వేస్తే..చెల్లని ఓటు అవుతుంది

– సంక్షోభంలో అవకాశాలు వెతుక్కునే బాబు.. బీజేపీతో కాళ్ళ బేరానికి ఢిల్లీ వెళుతున్నాడేమో..!
– బద్వేలులో తెలుగుదేశం-బీజేపీ నేతలు కలిసి ప్రచారం చేస్తున్నది నిజం కాదా..?
– బద్వేల్ తాగునీటి సమస్యపై బహిరంగ చర్చకు మేం సిద్ధం
– తప్పు లేకపోతే.. “బోషిడీకే బాబు” అని పిలవవచ్చా..?
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన రెడ్డి ప్రెస్ మీట్
కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న విమర్శలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థనరెడ్డి ఘాటుగా స్పందించారు. సోము వీర్రాజుకు కాకాణి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
1. అసలు ఈరోజు మీ ద‌గ్గ‌ర ఉన్న వ్య‌క్తులు కానీ, బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొంటున్న వ్య‌క్తులుకానీ బీజేపీకి సంబంధించిన‌వారా? లేక తెలుగుదేశం బీజీపీకి సంబంధించిన‌వారా? చెప్పగలరా?
– టీడీపీలో ఎంపీలుగా, మంత్రులుగా ప‌ద‌వులు నిర్వ‌ర్తించిన‌వారిని మీ పార్టీలో చేర్చుకుని, వారి ద్వారా టీడీపీ నాయ‌కులకు గాలం వేస్తూ, వారి ఇళ్ల చుట్టూ ప్ర‌ద‌క్ష‌ిణలు చేస్తూ, వారి ప్రాప‌కం కోసం ప్రాకులాడుతూ ఏదో ర‌కంగా నాలుగు ఓట్లు సంపాదించుకోవాల‌ని తాప‌త్ర‌య పడుతుంది మీరా.. మేమా..?
– బ‌ద్వేల్ ఉప‌ఎన్నిక‌లో పోలింగ్ ఏజెంట్ల‌ను కూడా పెట్టుకోలేని దౌర్భ‌ాగ్య‌మైన స్థితిలో బీజేపీ ఉన్నది నిజం అవునా.. కాదా..?
– బీజేపీ, టీడీపీతో క‌లిసి పనిచేసే ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి, ఆ పార్టీ నాయ‌కుల్ని ప్రలోభ పెడుతున్నది మీరా.. మేమా?
– మీకు ఎటూ డిపాజిట్లు గ‌ల్లంత‌ు కావడం ఖాయమని తెలిసి, పోలింగ్ తేదీ 30 దాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, రెండో తేదీ త‌ర్వాత ప్ర‌జాభిప్రాయాన్ని స్వీక‌రిస్తున్నామ‌ని తోక‌ముడిచి వెళ్ళేందుకు మీరు సిద్ధమయ్యారా.. లేదా..?
– ఉప ఎన్నికలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తే, మీ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు.. టీడీపీ నేతలకు ప‌ద‌వులిస్తామని ప్ర‌లోభ‌పెట్టి మావైపుకు తిప్పుకున్నామని రేపు ప్ర‌చారం చేయ‌డానికి ముందుగానే మీరు పథకం రచించుకున్నది నిజం కాదా..?
2. జ‌గ‌న్ మోహన్ రెడ్డిగారి నాయ‌క‌త్వంలో.. ప్రతి ఎన్నికలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోరాడిన పార్టీ..
– మీ మిత్రపక్షం.. జ‌న‌సేన తొలుత పోటీ నుంచి విర‌మించుకున్నట్లు ప్రకటించి, మ‌ర‌లా మ‌ద్ద‌తిస్తున్నామ‌న్నారు.
– అలానే, టీడీపీలో ప్ర‌ధానంగా ఉన్న వ్య‌క్తుల్ని ముందు పెట్టి వాళ్ల మీద ఆధార‌ప‌డి మీరు ఎలక్ష‌న్ చేస్తున్నారు
– కేంద్ర మంత్రుల్ని తీసుకుచ్చి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా బీజేపీకి ఓటు వేస్తే.. అది చెల్లని ఓటు అవుతుందన్నది ప్రజలకు బాగా తెలుసు.
3. సోము వీర్రాజు గారు అవ‌గాహ‌న ఉండి మాట్లాడారా? అవ‌గాహ‌న లేక మాట్లాడుతున్నారా? కేవలం, ప్రభుత్వాన్ని విమ‌ర్శించాలన్నట్టు మాట్లాడుతున్నారో తెలియ‌దు కానీ.. బద్వేల్ లో త్రాగునీరు స‌మ‌స్య గురించి మాట్లాడుతున్నారు.. దీనిపై సోము వీర్రాజు స‌వాల్ ను స్వీక‌రిస్తున్నాము. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది. గతంలో 5 ఏళ్ళు టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఏం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఏం చేశాం అన్న దానిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు మీరు వ‌స్తే మేం సిద్దంగా ఉన్నాము.
– టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో, బ‌ద్వేల్ కు నీరు ఇవ్వ‌లేక‌పోతే ట్యాంక‌ర్ లతో నీరు స‌ప్ల‌య్ చేశాము. బద్వేల్ త్రాగునీరు స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారం లభించిందంటే.. అందుకు ప్ర‌ధాన‌ కార‌ణం దివంగ‌త మ‌హానేత రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు ప్రారంభించిన బ్ర‌హ్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కు.. జ‌గ‌న్ పాల‌న‌లో సమృద్ధిగా నీరు నింప‌డం, త‌ద్వారా గ్రౌండ్ వాట‌ర్ పెరిగింది. దాంతో బ‌ద్వేల్ మున్సిపాలిటీలో ఎక్క‌డికి వెళ్లిన త్రాగునీటి స‌మ‌స్య లేద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు- త్రాగునీటి స‌మ‌స్య మీ సంకీర్ణ ప్ర‌భుత్వంలోనే ఉంది.
4. బీజేపీకి ఓటు అడిగే హ‌క్కుగానీ, అభివృద్ది చేస్తామ‌ని చెప్పే హామీ ఇవ్వడానికి కూడా అవ‌కాశం లేదు. ప్ర‌జ‌లు బీజేపీకి ఓటు వేస్తే చెల్లని ఓటు కింద మారుతుంది అన్నది ప్రజలకు బాగా తెలుసు. బ‌ద్వేల్ కు రాబోయే రోజుల్లో బీజేపీ ఏం చేయ‌బోతుందో, ఏ విధంగా న‌మ్మ‌కం, విశ్వాసం క‌లిగిస్తుందో, ఏం ఉద్ద‌రిస్తారో స‌మాధానం చెబితే బాగుంటుంది. అలా కాకుండా మమ్మ‌ల్ని విమ‌ర్శించ‌డ‌మే అజెండాగా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ను వాడుకోవాల‌ని ఆలోచ‌న చేస్తే దానిక‌న్నా దుర్మార్గం ఇంకొక‌టి ఉండ‌దు.
5. కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తే.. స్టిక్క‌ర్ లు వేసుకున్నామ‌ని అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారు.. మీరిచ్చిన నిధులలో మీ వాటా ఎంత? కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వానికి హక్కుగా కొన్ని నిధులు ఇస్తుంది. అది కూడా త‌ప్పా.. ? రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కోవిడ్ స‌మయంలో కేంద్రం అండ‌గా నిలిచిన సంద‌ర్భాలు ఉన్నాయా? 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం అని లెక్క‌లు చెబుతున్నారు.. అస‌లు మేము చేసే అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో మీ వాట ఎంత ఉందో చర్చిద్దాం, రండి.
తిట్లే టీడీపీ ప్రధాన ఎజెండా..
6. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ‌, అభివృద్ది కార్య‌క్ర‌మాలు పెద్దఎత్తున అమ‌ల‌వుతున్నాయి. ఎక్క‌డ‌కు వెళ్లిన ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌తి కుటుంబానికీ లబ్ధి చేకూరింది.
– వీట‌న్నింటినీ చూసి ఓర్వ‌లేక, ఉనికి కోల్పోతున్నామ‌న్న భ‌యంతో చంద్ర‌బాబు దొంగ దీక్ష‌లు చేస్తున్నాడు. ఆ దీక్షలో తన పార్టీ నేతలతో ప్రభుత్వాన్ని తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడు.
– చంద్ర‌బాబు చేస్తున్న దొంగ దీక్ష‌లో అచ్చెన్నాయుడు ప్ర‌తిఒక్కర్ని తిట్ట‌మ‌ని చెవులో చెప్పి పంపించ‌డం , చంద్ర‌బాబు ఆపండ‌ని చేయి ఊప‌డం.. ఇలా హైడ్రామా కొన‌సాగుతుంది
7. చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు మాట్లాడుతూ.. పట్టాభి వాడిన బోషిడీకే పదం తప్పు కాదంటున్నారు. అలా అయితే రేప‌ట్నించి చంద్ర‌బాబును కూడా బోషిడీకే బాబు అంటే త‌ప్పులేదు క‌దా.. మీ కుమారుడు బోషిడీకే డాడీ అని, మీ మ‌న‌వుడు బోషిడీకే తాత అని పిల‌వ‌చ్చా?
– ఈ స‌మ‌స్య‌కు కార‌కులు ఎవ‌రు? దీని సృష్టించింది ఎవ‌రు? ఎవ‌రు వ‌ల్ల రాష్ట్రంలో ఈ స‌మ‌స్య వ‌చ్చింది? మీరు వ్యూహాత్మ‌కంగా ముఖ్య‌మంత్రిగారిని తిట్టించారు. అడ్ర‌స్ లేని వారిని తీసుకువ‌చ్చి పార్టీ ఆఫీసులోకూర్చో పెట్టి దుర్మార్గంగా తిట్టిస్తున్నారు.
– జ‌గ‌న్ గారు సీఎంగా ఉండ‌డాన్ని భ‌రించ‌లేక‌పోతున్నారు కాబ‌ట్టే ప్ర‌భుత్వం మీద నింద‌లు వేస్తూ.. ప్ర‌భుత్వాన్ని అర్జెంటుగా దించేయాలని మాట్లాడుతున్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వం ఇది, దించటం మీ తరం కాదు.
8. అమిత్ షా మీద‌ గ‌తంలో రాళ్లు వేసిన సంగ‌తి మర్చిపోయారా చంద్ర‌బాబూ..?
– అమిత్ షా కుటుంబ స‌భ్యుల‌తో తిరుమ‌ల‌ వ‌చ్చిన‌ప్పుడు రాళ్ల దాడి చేయించిన సంఘ‌ట‌న గుర్తుచేయ‌డానికా మీరు ఢిల్లీ వెళ్లేది..?
– చంద్ర‌బాబు ఎప్పుడూ చెబుతుంటాడు. సంక్షోభంలో అవ‌కాశాలు వెతుక్కుంటానని. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నకి వెళ్ళి, రాబోయే రోజుల్లో బద్వేల్ ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెట్టి క‌లిసి ప‌నిచేద్దామ‌ని సంకేతాలు ఇవ్వ‌డానికి వెళ్తున్నారా? లేక కాళ్ళ బేరానికి వెళ్తున్నారో తెలియ‌దు.
9. చంద్ర‌బాబు చేస్తున్న కుట్ర రాజకీయ వ్య‌వ‌హారాలన్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ప్ర‌జ‌లు ఆవేశంతో ఉన్నా స‌రే.. ముఖ్య‌మంత్రిగారు సంయ‌మ‌నం పాటించ‌మ‌న్నారు కాబ‌ట్టి చంద్ర‌బాబు దొంగ దీక్ష‌లు చేసినా , వైయ‌స్ఆర్ సీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌లతో సంయ‌మ‌నం పాటించారు.
10. చంద్ర‌బాబులాంటి వ్య‌క్తిని భరించడం.. ఆంధ్ర‌రాష్ట్ర దౌర్భ‌ాగ్యం. ప్రజలు గ‌త చంద్రబాబు ప్ర‌భుత్వం చేసిన మోసాన్ని గుర్తించుకున్నారు. ఈ ప్ర‌భుత్వం చేస్తున్న‌ అభివృద్ది, సంక్షేమాన్ని గుర్తుంచుకుంటున్నారు..
– బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి సంబంధించి నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింది, కాక‌పోతే, ఎన్నిక‌ల కోడ్ రావ‌డం ద్వారా ఆ ప‌నులు ప్రారంభం కాలేదు. మ‌ట్టి రోడ్డు ఎక్క‌డ క‌నిపించ‌కుండా సిమెంట్ రోడ్లు వేస్తాం.
11. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తాము ఏం చేస్తామో చెప్పుకుంటే బాగుంటుంది కానీ, అభివృద్ది చేసిన వారిని ఏం చేశార‌ని అడిగితే అంత‌క‌న్నా దౌర్భ‌గ్యం ఇంకొక‌టి ఉండ‌దు.
– ఇప్ప‌టికైనా బీజేపీ నాయ‌కులు ఎవ‌రైనా స‌రే వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది
– బీజేపీ నాయ‌కులు వెళ్లి మాకు మ‌ద్ద‌తు ఇవ్వండని టీడీపీ నేత‌ల‌తో మాట్లాడుతున్న వార్త‌లు మీడియాలో, స్థానిక ప‌త్రిక‌ల్లో వ‌చ్చాయి. మీరు టీడీపీతో క‌లిసి తిరుగుతూ మాపై నెపం ఎందుకు వేస్తున్నార‌న్నదే మా అభ్యంత‌రం.

Leave a Reply