బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత

రోజుకో రకమైన పూలతో,రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ:మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ: ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నానే బియ్యం…

Read More

సింగరేణి లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా:కెసిఆర్

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన…

Read More

అసెంబ్లీలో సాక్షిగా పచ్చి అబద్దాలు వల్లిస్తున్న కేసీఆర్

– ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను అవమానిస్తారా? – సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? – అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే – ఉద్యోగాల కల్పనపైనా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే – రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట వాస్తవం కాదా? – మరో 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది నిజం…

Read More

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామన్న కేంద్రమంత్రి

🔸విద్యార్థుల సమస్యను మంత్రి మాన్సుఖ్ మాండవీయ దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ 🔸తమను ప్రమోట్ చేయాలంటూ ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు వేడుకోలు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ కు లేఖ రాశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల…

Read More

రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ

సీఎం కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూసే ఆశావహులకు కేసీఆర్‌ ప్రకటన ఊరటనిచ్చింది. దళితుల…

Read More

బతుకమ్మ పాట విడుదల

ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ‘అల్లిపూల వెన్నెల’ బతుకమ్మ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో పాటను ఆవిష్కరించారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే…

Read More

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఐదో స్థానం:మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం త‌ల‌స‌రి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌న్నారు. వృద్ధిరేటులో మొద‌టి స్థానంలో ఉంద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత…

Read More

విజయ డెయిరీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు

తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 17 లక్షల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద వివిధ సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద అఫ్జల్ గంజ్ చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ కు తెలంగాణ విజయ డెయిరీ ద్వారా ప్రతి…

Read More

కేటీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన

హైదరాబాద్‌ : రెండు రోజుల కిందట తన వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌ వేసిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్‌ సోమవారం అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం.. చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజలు అయినా.. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒక్కటే అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను…

Read More

జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు: TJSS

-ప్రవీణ్ ఆత్మహత్యకు కారణమైన వార్త యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి -ప్రవీణ్ కుటుంబానికి వార్తా యాజమాన్యం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి -మంగళవారం ఉదయం 11గంటలకు వార్త కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా -జర్నలిస్టు తొందర పడొద్దు మేము అండగా ఉంటాం ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, గౌటి రామకృష్ణ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వార్త ప్రత్రిక రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ ని వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక చెరువు…

Read More