తెలంగాణలో అకాల వర్షం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విజృంభించింది.. దీంతో, ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్క, ఈదురు గాలులతో కూడిన వర్షం కావడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. ఈ క్రమం లోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్లు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ కీలక హెచ్చరిక చేసింది….

Read More

త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి

* జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం * లోత‌ట్టు కాల‌నీలు, ట్రాఫిక్‌, విద్యుత్ స‌మ‌స్య‌పై స‌మీక్ష‌ * స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములు కావాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు హైద‌రాబాద్‌: భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌వ‌డం, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, విద్యుత్ అంత‌రాయాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అక్క‌డి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ…

Read More

కేసీఆర్ చరిత్ర హీనుడుగా మారిపోతాడు

-నమో అంటే నమ్మించి మోసం చేయడం -వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ : ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. వరంగల్ లాంటి చారిత్రాత్మక ప్రాంతం కేసీఆర్ హయాంలో మసకబారిపోయింది. కొండా సురేఖ అడిగిన గుడి, చర్చి, మసీదు కు జూన్ 30 లోపు న కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తా. మే 9 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తానని సవాల్ విసిరాను. రైతు భరోసా నిధులను…

Read More

ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు మోదీ వస్తున్నాడు?

-కారును తూకానికి అమ్మాల్సిందే -అల్లాటప్పా గా నేను సీఎం కుర్చీ లోకి రాలేదు -వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలి, అనకొండ లా మింగేవాళ్లు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ను పట్టి పీడుస్తున్నరు. బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు.. చీకటి ఒప్పందం చేసుకోని బీఆర్ఎస్ నాయకులను బీజేపీలోకి పంపించారు. వరంగల్ లో…

Read More

రైతు భరోసాను బీజేపే ఆపేసింది!

-రైతుల నోటికాడి ముద్దను లాగేసి.. అన్నదాతల నోట్లో మట్టి కొట్టింది – మంత్రి జూపల్లి కృష్ణారావు తెల్లారితే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమవుతుందనగా నోటికాడి బుక్కను బీజేపీ లాగేసిందని, . రైతు భరోసాను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు లేఖ రాశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయనగా…

Read More

నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్

ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్‌ను వివరణ కోరగా ఎస్‌బీఐ బ్యాంకు నుండి తీసుకురావలసిన పేపర్‌కు…

Read More

ఐదు నెల్లల్లో ఎందుకిట్ల జరుగుతాంది?

-గుజరాత్ మోడల్ అంటే గోద్రా మోడల్ తెస్తారా ? -బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా ట్రాష్.. నమ్మొద్దు -నేను కూడా హిందువునే -బస్సు యాత్ర – రోడ్డు షో లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ : మోడీ నూటా యాభై నినాదాలిచ్చిండు ఒక్కటి అమలుకాలేదు. అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చే దిన్ వచ్చినయి. సబ్కా సాత్ కాలేదు గానీ సబ్కా సత్య నాశ్ అయింది. ప్రధాని ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నాడు వచ్చినయ.?పదిహేను లేదు…

Read More

సార్.. మీరు ఆరోగ్యంగా ఉండాలి

– కేసీఆర్ కు మహారాష్ట్ర నేతల కొబ్బరి కుడుకల దండ బస్సుయాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ లో బస చేసిన కేసీఆర్ తో బిఆర్ ఎస్ మహారాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. మహారాష్ట్ర బి ఆర్ ఎస్ ఇంచార్జ్ కల్వకుంట్ల వంశీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర సీనియర్ నేతలు శంకరన్న డొంగే,సుధీర్ బిందు, గణేష్ కదమ్ తదితరులు అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ వారికి శుభం కలగాలని కోరుతూ.. మహారాష్ట్ర…

Read More

బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ కే క్రైస్తవ సంఘాల మద్దతు

-మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం -ముఖ్యఅతిథిగా పాల్గొన్న సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో పద్మారావు…

Read More

అన్ని వర్గాల మద్దతు

– సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్. ఎంపీ అభ్యర్ధి పద్మారావు ఎన్నికల ప్రచారంలో తమకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బీ.ఆర్.ఎస్. విజయం ఖాయంగా మారిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం పద్మారావు గౌడ్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. వెన్నంటే నిలవనుందని, ప్రజలు కాంగ్రెస్, భాజపా లకు…

Read More